బొబ్బిలి మండలాల్లో మంగళవారం కుండపోత వర్షం కురిసింది. ఏకదాటిగా కురిసిన వర్షానికి వీధులు, రోడ్లు జలమయమయ్యాయి. బొబ్బిలి మండలం జె. రంగరాయపురంలో నివాసాల మధ్య వరదనీరు, మురుగునీరు నిల్వ ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంగన్వాడీ పాఠశాల భవనం అనుసరించి ఖాళీ స్థలంలో నీరు నిల్వ ఉండడంతో దుర్వాసన వస్తోందని తెలిపారు. అలాగే బొబ్బిలి మండల తదితర గ్రామల్లో భారీ వర్షం కురిసింది.