బొబ్బిలి: లారీ ఆటో ఢీ.. ఇద్దరికి గాయాలు

84చూసినవారు
బొబ్బిలి: లారీ ఆటో ఢీ.. ఇద్దరికి గాయాలు
బొబ్బిలి మండలం గున్నతోటవలస సర్కిల్ వద్ద గ్రోత్ సెంట్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు వివరాలు ప్రకారం.. శుక్రవారం బొబ్బిలి నుండి రాంభద్రపురం వెళ్లే ఆటో విజయనగరం నుండి వస్తున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఇద్దరు వ్యక్తులకు గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. బొబ్బిలి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you