అయోధ్య రామమందిరానికి బొబ్బిలి వీణ

61చూసినవారు
అయోధ్య రామమందిరానికి బొబ్బిలి వీణ
అయోధ్యలోని రామాలయానికి బొబ్బిలి వీణను బహుకరించాలని ఎమ్మెల్యే బేబీ నాయన సంకల్పించారు. ఈసందర్బంగా బుధవారం గొల్లపల్లిలో ఉన్న వీణల కేంద్రాన్ని ఆయన సందర్శించి, వీణ తయారీని పరిశీలించారు. రాబోవు అమ్మవారి పండుగలోపు ఈ వీణను తయారు చేసి ఎమ్మెల్యేకి అందజేస్తామని తయారీదారులు తెలిపారు. అతిత్వరలో ఆ వీణను అయోధ్య పంపించే ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే వివరించారు.

సంబంధిత పోస్ట్