కరెంట్ బిల్లులు శీత కాలంలోనూ ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయని బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్నప్పలనాయుడు అన్నారు. బొబ్బిలిలోని తన కార్యక్రమంలో మంగళవారం విద్యుత్ చార్జీల పెంపుపై ఈనెల 27న వైఎస్ఆర్సిపి చేపడుతున్న పోరుబాట కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం మాట తప్పి రాష్ట్ర ప్రజలకు వరుసగా విద్యుత్ షాక్ లు ఇస్తోందన్నారు.