బొబ్బిలి: హెచ్‌పిసిఎల్‌ పైపులైన్‌కు భూములివ్వం

69చూసినవారు
హెచ్‌పిసిఎల్‌ పైపులైన్‌కు తమ భూములను ఇవ్వమని రైతులు తెగేసి చెప్పారు. గురువారం బొబ్బిలి రైతు సంఘం ఆధ్వర్యంలో చింతాడ, రాముడువలస, శివుడవలస, కొండదేవుపల్లి, కమ్మవలస, పిరిడి గ్రామాల్లో విశాఖపట్నం నుండి రాయపూర్‌ వరకు హెచ్‌పిసిఎల్‌ పైపులైను వల్ల భూములు నష్టపోయిన రైతులకు కరపత్రాలు పంపిణీ చేశారు. బొబ్బిలి మండలాల్లో 15 గ్రామాలు మీదుగా హెచ్‌పిసిఎల్‌ పైపులైను వేస్తున్నట్లు ఆ గ్రామాల రైతులకు నోటీసులు ఇచ్చారన్నారు.

సంబంధిత పోస్ట్