విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్రం ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఉత్తరాంధ్ర సాధన సమితి అధ్యక్షులు వేమురెడ్డి లక్ష్ము నాయుడు అన్నారు. బొబ్బిలి కోరాడ వీధి జంక్షన్ వద్ద విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా గురువారం నిరసన వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కును కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అమ్మేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు.