రేషన్ కార్డులు ఉన్న వారందరికి కందిపప్పు ఇవ్వాలని లోక్ సత్తా జిల్లా అధ్యక్షుడు ఆకుల దామోదర్ డిమాండ్ చేశారు. బొబ్బిలిలో ఆయన శనివారం మాట్లాడుతూ.. కార్డుదారులకు కందిపప్పు పూర్తి స్థాయిలో ఇవ్వకపోవడంతో బహిరంగ మార్కెట్ లలో కొనుగోలు చేసేందుకు పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. చాలా వార్డులలో ఎండియు ఆపరేటర్ లు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ప్రజలు చెపుతున్నారని, రెవెన్యూ అధికారులు దృష్టి పెట్టాలన్నారు.