బొబ్బిలి: దైనందిన జీవితంలో యోగా ఒక భాగం కావాలి

56చూసినవారు
బొబ్బిలి: దైనందిన జీవితంలో యోగా ఒక భాగం కావాలి
ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో యోగ ఒక భాగం కావాలని బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ రాంబార్కి శరత్ బాబు అన్నారు. బుధవారం మున్సిపల్ కమిషనర్ ఎల్ రామలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగాపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ మున్సిపల్ కార్యాలయం వద్ద పలు యోగాసనాలు వేశారు. యోగాతో ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని తెలిపారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు గెంబలి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్