బొబ్బిలి యువ రాజు, ఎమ్మెల్యే బేబీ నాయన మరోసారి తన నిరాడంబరతను చాటుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగియటంతో గురువారం రాత్రి ఆయన బొబ్బిలి తిరుగు పయన క్రమంలో విజయవాడ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో రైల్వే స్టేషన్‌లో ఆయన సాధారణ ప్రయాణికుడిలా ప్లాట్ ఫామ్‌పై కూర్చున్నారు. ఆ సమయంలో వెంట గన్‌మెన్లు సైతం ఎవరు లేరు. దీంతో బేబీ నాయన సింప్లిసిటీ చూసి ప్లాట్‌పామ్‌పై సహచర ప్రయాణికులు సైతం నివ్వెరపోయారు.