కేంద్రంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసే విధంగా చర్యలు తీసుకోవడం దుర్మార్గమని సీఐటీయు జిల్లా నాయకులు బలసా శ్రీనివాసరావు ఆరోపించారు. బుధవారం భారత కోర్కెల దినం (డిమాండ్స్ డే) సందర్భంగా రామభద్రపురం మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ యజమానులకు తొత్తుగా వ్యవహరించే అత్యంత ప్రమాదకరమైన లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.