బొబ్బిలి పట్టణంలో గాంధీ బొమ్మ సెంటర్ లో గ్రీన్ బెల్ట్ సభ్యులు ఎస్. వి రమణ మూర్తి ఆధ్వర్యంలో గురువారం జరిగిన వినాయక విగ్రహాల పంపిణీలో భాగంగా మాజీ మున్సిపల్ చైర్మన్ అచ్యుతవల్లి చేతుల మీదుగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసారు.ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుని ప్రతిమలనే పూజించాలని జల కాలుష్యం కాకుండా పరిరక్షించాలని కోరారు.