బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పర్యటించారు. ఆదివారం గొల్లపల్లి అంబేద్కర్ కాలనీలో రూ.90లక్షల ఎంపీ ల్యాండ్స్ నిధులతో నిర్మించే అభివృద్ధి పనులకు ఎంపీ కలిశెట్టి, బొబ్బిలి శాసనసభ్యుడు బేబీనాయన శంకుస్థాపన చేశారు. తొలుత అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదాలు తీసుకున్నారు. తల్లికి వందనం చేసిన తర్వాత లబ్ధిదారుల తల్లులు, పిల్లలతో స్థానిక అగురు వీధిలో మాట్లాడారు.