బొబ్బిలి మున్సిపల్ వైస్‌ఛైర్పర్సన్ రమాదేవిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల అధికారి రామ్మోహనరావు అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 21 మంది కౌన్సిలర్లు, ఎక్స్ అఫిషియో సభ్యుడు బేబీనాయన హాజరయ్యారు. తీర్మానానికి 22 ఓట్లు పడటంతో అది అంగీకరించమని అధికారులు ప్రకటించారు.