పాత బొబ్బిలి పెట్రోల్ బంకు సమీపంలో రోడ్డు భారీ గోతులతో భయంకరంగా తయారైంది. రోడ్డుపై గోతులు ఏర్పడడంతో బొబ్బిలి నుంచి పార్వతీపురం, రాయగడ వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోతుల వలన వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రోడ్డు బాగు చేయాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.