నాణ్యత ప్రమాణాలు పాటించాలి

75చూసినవారు
నాణ్యత ప్రమాణాలు పాటించాలి
బాడంగి మండలంలోని విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు అమ్మకాలు జరుపుతున్న ప్రైవేటు డీలర్లు విధిగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని మండల వ్యవసాయాధికారి కె శిరీష చెప్పారు. మండల కేంద్రంలోని శ్రీ సిద్ధి వినాయక ట్రేడర్స్ అండ్ ఫెర్టిలైజర్స్ శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డీలర్లు నాణ్యతతో కూడినవి మాత్రమే రైతులకు విక్రయించాలన్నారు. రికార్డులు సక్రమంగా నిర్వహించాలన్నారు.

సంబంధిత పోస్ట్