డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన 4గురు వ్యక్తులకు సోమవారం సాలూరు మేజిస్ట్రేట్ హర్షవర్ధన్ ఒక్కొక్కరికి 10 వేలు జరిమానా విధించినట్లు రామభద్రపురం ఎస్ఐ ప్రసాదరావు తెలిపారు. ఇటీవల తమ సిబ్బంది ఆధ్వర్యంలో చేపట్టిన వాహన తనిఖీల్లో గరివిడి, కాకినాడ, కోరపు కృష్ణాపురం, గడసాం గ్రామాలకు చెందిన నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు.