అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ అని, అందరి హృదయాలలో చిరస్మరణీయంగా నిలిచిపోయారని ఆరికతోట మాజీ సర్పంచ్ పెంకి భీమయ్య అన్నారు. సోమవారం అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని ఆరికతోట జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అలాగే రామభద్రపురం తహశీల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మార్వో సులోచనారాణి అధ్యర్యంలో అంబేద్కర్ కు నివాళులు అర్పించారు.