ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు మే 10వ తేదీలోగా అన్ లైన్ దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో రత్నం తెలిపారు. 2025-26 సంవత్సరానికి రామభద్రపురం మండలానికి 11యూనిట్లు మంజూరయ్యాయన్నారు. ఐ. ఎస్. బి సెక్టార్ టైప్ 1, 2, ట్రాన్స్ పోర్ట్ సెక్టార్ టైప్ 1, 2 లలో అభ్యర్థి ప్రావీణ్యత మేరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దీనిలో 40 శాతం రాయితీ, 55 శాతం బ్యాంకు రుణం, 5శాతం లబ్ధిదారు మార్జిన్ మనీగా చెల్లించవలసి ఉంటుందన్నారు.