యోగాతో ప్రతీ ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యం పొందుతారని రామభద్రపురం తహసిల్దార్ ఆకుల సులోచనారాణి అన్నారు. మండల కేంద్రంలో సోమవారం యోగాంధ్ర ర్యాలీ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ యోగా ప్రతిరోజూ చేయడం ద్వారా మానసిక ఉల్లాసం వస్తుందన్నారు. మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన ఉద్యోగులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు వైద్య సిబ్బంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు.