రామభద్రపురం రైతు సేవా కేంద్రం-2లో రాయితీ వరి విత్తనాలను టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి చింతల రామకృష్ణ ఆధ్వర్యంలో రైతులకు పంపిణీ చేశారు.మంగళవారం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు పంపిణీకి సిద్ధంగా ఉందని అన్నారు. త్వరలో అన్నదాత సుఖీభవ నిధులు పెట్టుబడి సాయంగా రైతన్నలకు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వ్యవసాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.