పిండ బదిలీ ప్రక్రియ విజయవంతానికి శతశాతం కృషి చేస్తున్నామని జిల్లా పశువైద్య సంచాలకులు డాక్టర్ వైవీ రమణ తెలిపారు.మంగళవారం జగన్నాధపురంలో రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యనిర్వాహణాధికారి డాక్టర్ ఎం శ్రీనివాసరావుతో కలిసి గిరి జాతి ఆవు దూడను క్షేత్రస్థాయి పరిశీలన చేశారు.ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 350 పశువులకు పిండ బదిలీ ప్రక్రియ చేశామనీ, దీని ద్వారా 15-20 శాతం ఫలితాలు సాధించామని తెలిపారు.