ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించడానికి ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని రామభద్రపురం ఎంఈవో తిరుమల ప్రసాద్ తెలిపారు. బుధవారం స్థానిక శ్రీరామ్ నగర్ కాలనీలో పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యతోపాటు మౌళిక సౌకర్యాలు, ఉచిత భోజనం, పుస్తకాలు అందిస్తున్నామన్నారు. అలాగే గ్రామాల్లో కరపత్రాలు, ఫ్లెక్సీలతో ప్రభుత్వ పాఠశాలల పనితీరుపై ప్రచారం చేస్తున్నామన్నారు.