రామభద్రపురం వైసీపీ కార్యాలయంలో ఈనెల 27న జరగనున్న విద్యుత్ చార్జీల భారంపై పోరుబాట గోడపత్రికను మంగళవారం మాజీ ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామే తప్ప పెంచబోమని అబద్ధ బాంబులు ఇచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ హామీలను తుంగలో తొక్కేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చొక్కాపులక్ష్మణరావు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.