ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల సమస్యల పరిష్కారంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చర్యలు నామమాత్రంగా ఉన్నాయని ఏపీటీఎఫ్ జిల్లా శాఖ అధ్యక్షులు మడక బలరామ్ నాయుడు అన్నారు. రామభద్రపురం మండల కేంద్రంలో శనివారం ఆయన మాట్లాడుతూ. ప్రభుత్వం ఏర్పడి 9నెలలు పూర్తయినా ఇంత వరకు ప్రభుత్వ ఉద్యోగుల అంశాలపై దృష్టి సారించకపోవడంతో అసంతృప్తికి దారితీస్తుందన్నారు. 11 వ పిఆర్సి, డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.