ఇంటర్మీడియట్ ప్రధమ, ద్వితీయ పరీక్షా ఫలితాల్లో బూసాయవలస కేజీబీవీ కళాశాలలో చదువుతున్న విద్యార్ధినులు ప్రతిభ చాటారు. ప్రధమ సంవత్సరం విద్యార్ధినులు 33 మందికీ గాను 32 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు 33 మందికి 33 మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రధమ ఇంటర్ బైపీసీలో సనపతి షర్మిల 414, అలాగే ద్వితీయ ఇంటర్ బైపీసీలో షర్మిల 963 మార్కులు సాధించారు. శనివారం వీరిని కళాశాల ప్రిన్సిపల్ ఎం. దీప అభినందించారు.