గర్భిణులు క్రమం తప్పకుండా పోషకాహారం తీసుకోవాలని అంగన్వాడీ సూపర్వైజర్ కృష్ణకుమారి కోరారు. రామభద్రపురం పరిధిలోని తారాపురం-1 అంగన్వాడీ సెంటర్ పరిధిలో శుక్రవారం పోషకాహార పక్షోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ గర్భిణులు వెయ్యిరోజుల సంరక్షణపై శ్రద్ధ వహించాలన్నారు. పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బెవర రవణమ్మ, ఏఎన్ఎంలు అంగన్వాడీలు పాల్గొన్నారు.