వివిధ రూపాల్లో అక్రమంగా తరలిస్తూ సీజ్ చేసిన మద్యాన్ని ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ దొర సమక్షంలో రామభద్రపురం పోలీసు స్టేషన్లో ఎస్ఐ ప్రసాదరావు బుధవారం ధ్వంసం చేశారు. మండలంలో నమోదైన
34 ఎక్సైజ్ కేసులలో 576 మద్యం బాటిళ్లు, రెండు నాటుసారా కేసులలో 79లీటర్ల నాటుసారాను గొయ్యి తవ్వి అందులో పారబోసినట్లు ఎస్ఐ తెలిపారు. బెల్ట్ షాపులు నిర్వహణ, అక్రమ మద్యం తరలింపు, నాటుసారా తయారీపై కఠిన చర్యలు తప్పవన్నారు.