రామభద్రపురం: మహిళా చట్టాలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

52చూసినవారు
రామభద్రపురం: మహిళా చట్టాలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
మహిళా చట్టాలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని బొబ్బిలి రూరల్ సీఐ నారాయణరావు హెచ్చరించారు. కొండకెంగువలో గురువారం సాయంత్రం సంకల్పం కార్యక్రమంపై గ్రామస్థులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ. విద్యార్థులను వేధించిన వారిపై పోక్సో కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. 18 సంవత్సరాలలోపు బాలికలకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్