రామభద్రపురం: భక్తి,శ్రద్ధలతో మట్టల ఆదివారం

54చూసినవారు
రామభద్రపురం: భక్తి,శ్రద్ధలతో మట్టల ఆదివారం
క్రైస్తవ సోదరులు జరుపుకొనే ముఖ్యమైన పండగల్లో మట్టల ఆదివారం (పామ్ సండే) ఒకటి. దీనిని ఆదివారం ఆ మత పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రామభద్రపురం ఆరికతోట ఏడిఎం బాప్టిస్ట్ చర్చి కాపరుల ఆధ్వర్యంలో తెల్లవారుజామునుంచే ప్రత్యేక ప్రార్థనలు చేసి ఈత, ఖర్జూర మట్టలను పట్టుకొని వీధుల్లో ర్యాలీ చేశారు. అనంతరం యేసు క్రీస్తు నామాన్ని జపిస్తూ చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

సంబంధిత పోస్ట్