అప్పలరాజుపేట గ్రామానికి చెందిన బెవర సింహాచలం (65) ఆదివారం రాత్రి కడుపునొప్పి బరించలేక ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఎస్ఐ ప్రసాదరావు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు ఈమెకు కడుపు నొప్పి తీవ్రత ఎక్కువ అయ్యి ఎన్ని మందులు వాడినా తగ్గకపోవడంతో మానసిక క్షోభకు గురయ్యి ఆత్మహత్య చేసుకునట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.