విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న శ్రీచైతన్య కళాశాల యాజమాన్యానికి కొమ్ము కాస్తున్న ఆర్‌ఐఒను సస్పెండ్ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. రామ్మోహన్, విజయనగరం జిల్లా కార్యదర్శి వెంకటేష్ డిమాండ్ చేశారు. బొబ్బిలి పట్టణంలో నిర్మాణంలో ఉన్న భవనంలో శ్రీచైతన్య కళాశాల యాజమాన్యం ఇంటర్ తరగతులు నిర్వహించడంతో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బుధవారం అడ్డుకున్నారు.