రామభద్రపురం మండల వ్యవసాయాధికారిగా అమరా శివ శనివారం బాధ్యతలు చేపట్టారు. బొబ్బిలి వ్యవసాయ కార్యాలయం నుంచి ఇక్కడ నియమితులయ్యారు. ఇక్కడ పనిచేసిన ఏవో వెంకటయ్య పదవీ విరమణ చేశారు. నూతన ఏవోకు సిబ్బంది ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సిబ్బందిని సమన్వయం చేసుకుని ప్రభుత్వ పథకాలు అర్హులైన రైతులకు అందించేందుకు కృషి చేస్తానన్నారు.