బొబ్బిలి పట్టణం లో అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం విద్యార్థి జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. సాయికిరణ్ యాదవ్ మాట్లాడుతూ బీసీ బాలుర కళాశాల వసతి గృహాన్ని కోమటిపల్లి నుంచి బొబ్బిలికి తరలించాలని డిమాండ్ చేశారు. పాత వసతి గృహ భవనం వినియోగం లేకుండా ఉండిపోయిందని, అక్కడ కొత్త వసతి గృహం నిర్మించాలని ఆయన కోరారు. ఈ సమస్యపై అన్ని విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలతో కలిసి ఉద్యమం చేస్తామని ప్రకటించారు.