తెర్లాం: 'వీటి వల్ల పంచాయతీలకు ఆదాయ'

68చూసినవారు
తెర్లాం: 'వీటి వల్ల పంచాయతీలకు ఆదాయ'
పంచాయతీ అభివృద్ధికి చెరువు గట్లపై కొబ్బరి, టేకు మొక్కలను పెంచుతున్నట్లు తెర్లాం మండలం రంగప్పవలస సర్పంచ్ శనపతి రాంబాబు వివరించారు.  మంగళవారం ఆయన మాట్లాడుతూ గతంలో ఎంపీడీఓగా పని చేసిన శంబంగి రామకృష్ణ ప్రోత్సాహంతో చెరువు గట్లపై మొక్కలు నాటినట్లు తెలిపారు. కొబ్బరి, టేకు చెట్లు పెంపకంతో పంచాయతీలకు ఆదాయం వస్తోందన్నారు. చెరువులు కూడా ఆక్రమణకు గురికాకుండా చూడవచ్చునన్నారు.

సంబంధిత పోస్ట్