బొబ్బిలి మున్సిపల్ పరిధిలో చేపట్టనున్న అభివృద్ధి పనుల్లో భాగంగా ఆదివారం పలు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టనున్నారు. 15వ ఆర్థిక సంఘం, ఎంపీ నిధులు మున్సిపల్ సాధారణ నిధులతో అభివృద్ధి పనులు చేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఎల్ రామలక్ష్మి తెలిపారు. అభివృద్ధి పనులకు విజయనగరం ఎంపీ కె అప్పలనాయుడు, ఎమ్మెల్యే బేబినాయన శంకుస్థాపన చేయనున్నట్లు ఆమె అన్నారు. శంకుస్థాపనకు కౌన్సిలర్లు, అధికారులు హాజరుకావాలని కోరారు.