మానవ హక్కుల రక్షణకు తనవంతు కృషి చేస్తానని ఇన్డో హ్యూమన్ రైట్స్ మండల నూతన అధ్యక్షుడు కనకల ధర్మారావు తెలిపారు. ఇటీవల జాతీయ కమిషన్ చైర్మన్ ప్రసాదరావు, జిల్లా అధ్యక్షులు అచ్చిరెడ్డి లు రామభద్రపురం మండల అధ్యక్షునిగా తనను ఎంపిక చేశారన్నారు. రామభద్రపురం లో ఆదివారం ఆయన మాట్లాడుతూ మానవ హక్కుల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని తన దృష్టికి వచ్చిన మానవ హక్కుల ఉల్లంఘనలను, వేధింపులను పరిశీలించి తగు న్యాయం చేస్తానని తెలిపారు.