విజయనగరం జిల్లా చీపురుపల్లి మండల 104 వాహన ఉద్యోగులు, తమ 3 నెలల వేతనాలు ఇంకా అందకపోవడంతో కుటుంబ పోషణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుపుతూ.. కర్లం పి హెచ్ సి వైద్యాధికారిణి డా. జి. అనురాధకు మంగళవారం వినతిపత్రం అందించి, 104 సేవలను ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా నిర్వహించాలని, పిఎఫ్ బకాయిలు చెల్లించాలని కోరారు. సీనియర్ డ్రైవర్లకు స్లాబ్ అమలు చేయాలని అభ్యర్థించారు.