ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా టీటీడీపై భూమన కరుణాకరరెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని. మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు. గతంలో వెంకటేశ్వరస్వామిపై అనేక విమర్శలు చేసిన కరుణాకర్ రెడ్డి మరోసారి దుష్ప్రచారానికి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం చీపురుపల్లిలో విలేకరులతో నాగార్జున మాట్లాడారు.