మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని జిల్లా తెదేపా అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. చీపురుపల్లిలో ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఎన్నికలు హామీలు అమలు చేయడం లేదని బొత్స అనడం సిగ్గుచేటని అన్నారు. వైకాపా నాయకులు గ్రామాల్లోకి వెళ్తే అక్కడి ప్రజలే నిజాలేమిటో చెబుతారని సూచించారు. మీరు విమర్శలు చేసుకుంటూ వెళ్లండి. మేము అభివృద్ధి చేసుకుంటూ వెళ్తామన్నారు.