చీపురుపల్లి: అధిక పని ఒత్తిడి తగ్గించాలి

81చూసినవారు
చీపురుపల్లి: అధిక పని ఒత్తిడి తగ్గించాలి
సచివాలయాల్లో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులకు పలు రకాల సర్వేలతో అధిక పని ఒత్తిడి కలుగుతోందని, తమకు పని ఒత్తిడి తగ్గించాలని కోరుతూ చీపురుపల్లి మండలంలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులు మంగళవారం మండల పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో ఎంపీడీవో ఐ సురేష్ కు వినతిపత్రం అందజేశారు. వివిధ రకాల సర్వేలతో ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులపై పని ఒత్తిడి పెంచుతోందని, పని ఒత్తిడి తగ్గించే చర్యలు చేపట్టాలని కోరారు.

సంబంధిత పోస్ట్