వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పి ఎ సి) సభ్యుడిగా మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ నియామకమయ్యారు. ఇందుకు సంబంధించి తాడేపల్లిలోని వైసీపీ పార్టీ కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆదేశాలతో 17 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ జాబితా విడుదల చేసింది. పార్టీలో బెల్లాన కు సముచిత స్థానం కల్పించడంతో ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.