చీపురుపల్లికి చెందిన ఏ జగదాంబ (57) అనారోగ్య కారణాలతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న మానవతీయ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు టివి గోవిందరావు గురువారం మృతురాలి కుటుంబ సభ్యులను కలిసి, నేత్రదానంపై అవగాహన కల్పించారు. నేత్రదానానికి అంగీకరించాలని విన్నవించారు. నేత్రదానానికి జగదాంబ భర్త నరసింగరావు, కుమార్తె భవాని అంగీకరించడంతో రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది కార్నియాను సేకరించారు.