మెరకముడిదాం మండలం లో గల గర్భాం రామమందిరం వద్ద మంగళవారం సాయింత్రం శ్రీరామ నవమి కార్యక్రమం లో భాగంగా చెల్లూరు నారాయణరావు ప్రవళిక దంపతులచే సీతారాములవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేదంపండితులు అరవెల్లి హరిబాబు నవీన్ లు మంత్రాలపానలతో స్వామి వారి కళ్యాణం కనుల పండగా జరిగింది. సీతారాముల నామస్మరణతో కల్యాణ వేదిక మారమోగింది. ఈ కార్యక్రమం లో నారాయణరావు కుటుంభ సభ్యులు గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు.