చీపురుపల్లిలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా శుక్రవారం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు పూలే చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, వారి హక్కుల కొరకు పోరాడిన యోదుడు, తరగతి గదిలోనే సమాజ శ్రేయస్సు, అభివృద్ధి ఉన్నాయని నమ్మిన సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే అని అన్నారు.