వైసిపి మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తో చీపురుపల్లిలో గల ఆయన క్యాంపు కార్యాలయంలో ఆదివారం పలువురు వైసీపీ నాయకులు భేటీ అయ్యారు. కాగా మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ను వైసీపీ అధిష్టానం శనివారం పి ఏ సి సభ్యుడిగా నియమించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసిపి నాయకులు మీసాల వరహాల నాయుడు, అనంతం తదితరులు ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలుపుతూ దుస్చాలువాతో సత్కరించారు.