చీపురుపల్లి మండలం పత్తికాయ పాలవలసలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి విశేష స్పందన లభించినట్లు నిర్వహకులు తెలిపారు. వైసీపీ జిల్లా ప్రచార విభాగాధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాస నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో ఈసీజీ, బీపీ, షుగర్ వంటి పరీక్షలు నిర్వహించారు. రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షుడు వరహాల నాయుడు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.