గుర్ల మండలం కొండగండ్రేడు గ్రామంలో ఇటీవల శ్రీ సీతారాముల ఆలయాన్ని నిర్మించి, ప్రతిష్టా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి గ్రామస్తులు శ్రీ సీతారాముల ఉత్సవ విగ్రహాలను గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. భారీ బాణసంచా, మహిళల కోలాటం నడుమ భక్తులు హరే రామ హరే కృష్ణ నామ సంకీర్తనతో స్వామివారిని ఊరేగించారు. ఈ సందర్భంగా గ్రామ నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.