గుర్ల: ఉపాధి పనులు కల్పించాలని ఎంపీడీఓకు వినతి

64చూసినవారు
గుర్ల: ఉపాధి పనులు కల్పించాలని ఎంపీడీఓకు వినతి
తమ గ్రామంలో ఉపాధి హామీ పనులు యధావిధిగా నిర్వహించాలని గుర్ల మండలం గోషాడ గ్రామస్తులు డిమాండ్ చేశారు. గ్రామంలో నిర్వహించిన సమావేంలో ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గ్రామంలో ఉపాధి పనులు నిలిపివేయడం తగదని మండిపడ్డారు. ఉపాధి పనులు లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని జనసేన పార్టీ మండల అధ్యక్షులు యడ్ల సంతోష్ అన్నారు. తక్షణమే ఉపాధి పనులు కొనసాగించాలని కోరుతూ ఎంపీడీఓకు సోమవారం వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్