మెరకముడిదాం మండలం గర్భాం పంచముఖి ఆంజనేయ ఆలయం వద్ద గురువారం రాత్రి లారీ ఢీకొని విద్యుత్ స్థంబం విరిగింది. ఈ సమాచారంతో స్పందించిన విద్యుత్ అధికారులు, ఏపీఇపీడీసీఎల్ ఏఈ రమేష్, లైన్ మెన్ వెంకటనాయుడు తమ సిబ్బంది, కాంట్రాక్టర్ సుదీర్ సహకారంతో రాత్రి 12 గంటలకే స్థంబాన్ని పునర్నిర్మించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.