విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో వరుస మరణాలతో ప్రజలను భయభ్రాంతులకు గురవుతున్నారు. మరణాలు సంఖ్యపై స్పష్టత లేనప్పటికీ, వీరందరూ డయేరియాతో చనిపోయారని గ్రామస్థులు వెల్లడించారు. అయితే డయేరియా వల్ల ఒక్కరు కూడా మరణించలేదని వైద్యాధికారులు తెలిపారు. గ్రామానికి చెందిన ఏడుగురు వారం రోజుల వ్యవధిలోనే చనిపోవడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలోని సగం ఇళ్లల్లోని ప్రజలకు డయేరియా లక్షణాలు కనిపిస్తున్నాయి.